ఆందోళనకరంగా కాంబ్లీ ఆరోగ్యం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:00 AM
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (54) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అతడికి బ్రెయిన్‌స్ర్టోక్ వచ్చే అవకాశాలు...
ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (54) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అతడికి బ్రెయిన్‌స్ర్టోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారని కాంబ్లీ స్నేహితుడు, బీసీసీఐ మాజీ అంపైర్ మార్కస్ కౌటో తెలిపారు. గత కొంత కాలంగా వినోద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో చాలా రోజులు ఆసుపత్రిలో ఉండి కోలుకొన్నాడు. ‘అతడి జ్ఞాపకశక్తి కూడా క్రమంగా తగ్గుతూ పోతోంది. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి స్నేహితుల నుంచి విరాళాలు సేకరించాను. పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్లు హెచ్చరించార’ని మార్కస్ చెప్పారు. కాగా కాంబ్లీ మద్యం తీసుకోవడం పూర్తిగా మానేసినా, సిగరెట్లు మాత్రం తాగుతూనే ఉన్నాడట. ఆటోడ్రైవర్లు సహా...ఎవరు కనిపిస్తే వారిని సిగరెట్ల కోసం అడుగుతున్నాడట. ఇక 2013లో రెండుసార్లు గుండెకు శస్త్రచికిత్సలు చేయించుకున్న కాంబ్లీకి సచిన్..ఇతర మాజీ క్రికెటర్లు సహాయం చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ