Share News

వాంఖడేలో ‘శాస్త్రి’ స్టాండ్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:33 AM

ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ రవిశాస్త్రి పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం శుక్రవారం ప్రకటించింది...

వాంఖడేలో ‘శాస్త్రి’ స్టాండ్‌

ముంబై : ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ రవిశాస్త్రి పేరు పెట్టనున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ సంఘం శుక్రవారం ప్రకటించింది. ‘స్టేడియంలోని ప్రెస్‌ బాక్స్‌ కిందగల లెవెల్‌-1 స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని అపెక్స్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. ఆటగాడిగా, కోచ్‌గా భారత్‌తోపాటు ముంబై క్రికెట్‌కు రవిశాస్త్రి అందించిన సేవలకు గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఎంసీఏ తెలిపింది. అలాగే స్టేడియంలోని వివిధ ప్రవేశ ద్వారాలకు దిలీప్‌ సర్దేశాయ్‌, ఏక్‌నాథ్‌ సోల్కర్‌, డయానా ఎడుల్జీ పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:33 AM