Share News

వైభవ్‌కు తోడుగా..

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:01 AM

భారత టీ20 జట్టు తరఫున ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికైన టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీ వెంట అతడి తల్లిదండ్రులు కూడా వెళ్లనున్నారు...

వైభవ్‌కు తోడుగా..

యూకే టూర్‌కు వెళ్లనున్న తల్లిదండ్రులు

ముంబై: భారత టీ20 జట్టు తరఫున ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికైన టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీ వెంట అతడి తల్లిదండ్రులు కూడా వెళ్లనున్నారు. వైభవ్‌ వయస్సు కేవలం 15 ఏళ్లే కావడం, జట్టులో తనకన్నా ఎంతో పెద్దవారు ఉండడంతో వారితో కలిసిపోయేందుకు అతనికి కాస్త సమయం పడుతుందని బోర్డు భావిస్తోంది. అందుకే వైభవ్‌ వెంట కుటుంబసభ్యులు ఉంటే బావుంటుందని కార్యదర్శి సైకియా తెలిపాడు. ఈ విషయమై వైభవ్‌ కుటుంబానికి ఇప్పటికే బీసీసీఐ సమాచారమిచ్చినట్టు తెలిసింది. వైభవ్‌ వెంట అక్కడికి వెళ్లనున్న తల్లిదండ్రులకయ్యే ఖర్చులను మొత్తం బీసీసీఐనే భరించనుంది. గతంలో 16 ఏళ్ల వయసులో సచిన్‌ టెండూల్కర్‌ పాక్‌ టూర్‌కు ఎంపికైనప్పుడు కూడా తోడుగా అతడి అన్నయ్య అజిత్‌ను బోర్డు పంపించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 03:01 AM