Share News

ఇప్పుడైతే వైభవ్‌కు రూ. 30 కోట్లు!

ABN , Publish Date - May 29 , 2026 | 01:20 AM

ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన రాజస్థాన్‌ రాయల్స్‌ టీనేజ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభ.. అందరినీ నోరెళ్లబెట్టేలా...

ఇప్పుడైతే వైభవ్‌కు రూ. 30 కోట్లు!

  • భారీగా చెల్లిస్తానన్న సెహ్వాగ్‌

  • లీగ్‌ చరిత్రలోనే

‘బెస్ట్‌ బై’ అన్న లలిత్‌ మోదీ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన రాజస్థాన్‌ రాయల్స్‌ టీనేజ్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభ.. అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎక్కడ చూసినా వండర్‌ బాయ్‌ గురించే చర్చ. వెస్టిండీస్‌ గ్రేట్‌ క్రిస్‌ గేల్‌ రికార్డులపై కన్నేసిన వైభవ్‌ను ఇప్పుడు సోషల్‌ మీడియాలో ‘యూనివర్సల్‌ బేబీ బాస్‌’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. చిన్నవయసులోనే మేటి బౌలర్లను ఎదుర్కొంటూ అలవోకగా సిక్స్‌లు బాదుతున్న వైభవ్‌ను రాజస్థాన్‌ కొనుగోలు చేయడం.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యుత్తమ నిర్ణయమని లీగ్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ అన్నాడు. 2025 మెగా వేలంలో రాజస్థాన్‌ రూ. 1.1 కోట్లకు వైభవ్‌ను తీసుకుంది. అప్పుడు ఇదో సాహసంగా భావించినా.. సూర్యవంశీ సంచలన బ్యాటింగ్‌తో రాజస్థాన్‌కు ఎస్సెట్‌గా మారాడు. ఇప్పుడు వైభవ్‌ వేలానికి వస్తే ఎంతకు కొంటారని కామెంటేటర్ల మధ్య జరిగిన చర్చలో మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ అయితే.. టాప్‌ లేపే ధర కోట్‌ చేశాడు. ఏమాత్రం సంకోచం లేకుండా సూర్యవంశీని రూ. 30 కోట్లకు దక్కించుకొంటానన్నాడు. కాగా, వైభవ్‌ బ్యాటింగ్‌ స్వింగ్‌ అద్భుతంగా ఉందని దిగ్గజం సచిన్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ‘ఫ్రంట్‌ ఫుట్‌ను క్లియర్‌ చేసి తగిన ఖాళీని ఏర్పర్చుకొంటున్నాడు. ఈ కారణంగా తనకు నచ్చిన షాట్‌ ఆడే అవకాశం అతడికి దొరుకుతున్నద’ని రాశాడు.

ఎక్కువగా ఆలోచించను..

‘జరగబోయే మ్యాచ్‌ గురించి ముందే ఎక్కువగా ఆలోచించను. మైదానంలోకి దిగిన తర్వాతనే నా ఆట ఆడతా. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరు? పిచ్‌ ఎలా ఉంది? బౌండ్రీ ఎంత దూరంలో ఉంది? ఇలాంటి విషయాలపై దృష్టిసారిస్తా. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కొద్దిలో వేగవంతమైన శతకం మిస్సయిందన్న విషయం నాకు అవుటైన తర్వాతే తెలిసింద’ని వైభవ్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 29 , 2026 | 01:20 AM