Share News

కళ్లన్నీ వైభవ్‌పైనే..

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:10 AM

బెదురులేని ఆటతీరుతో ఇప్పటికే 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకొన్నాడు. ఇప్పుడు అతనే ప్రత్యేక ఆకర్షణగా...

కళ్లన్నీ వైభవ్‌పైనే..

  • నేటి నుంచి భారత్‌ ‘ఎ’ ముక్కోణపు సిరీస్‌

ఉదయం 10 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో

దంబుల్లా: బెదురులేని ఆటతీరుతో ఇప్పటికే 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకొన్నాడు. ఇప్పుడు అతనే ప్రత్యేక ఆకర్షణగా మంగళవారం నుంచి 21 వరకు జరిగే ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భారత్‌ ‘ఎ’ జట్టు ఆడబోతోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో యువ భారత్‌ తలపడనుంది. అఫ్ఘానిస్థాన్‌ ‘ఎ’ మూడో జట్టుగా బరిలోకి దిగనుంది. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ కెప్టెన్సీకి కూడా పరీక్షగా ఈ సిరీస్‌ నిలువనుంది. అటు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత టీ20 జట్టుకు ఎంపికైన వైభవ్‌.. లంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా ఐపీఎల్‌ స్టార్లతో కూడిన భారత్‌ ఈ సిరీ్‌సలో ఫేవరెట్‌గా మారింది. మరోవైపు సూర్యవంశీ క్రేజ్‌ కారణంగా ఈ సిరీస్‌ను పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సోనీ నెట్‌వర్క్‌ నిర్ణయించడం విశేషం.

ఇవి కూడా చదవండి:

అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత

అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?

Updated Date - Jun 09 , 2026 | 03:10 AM