Share News

వైభవ్‌కు భారీ జరిమానా

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:29 AM

ముక్కోణపు వన్డే సిరీ్‌సలో రెండ్రోజుల క్రితం శ్రీలంక ‘ఎ’ జట్టు ఆటగాళ్లతో జరిగిన వివాదానికి సంబంధించి భారత ‘ఎ’ జట్టు స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ చర్యలు...

వైభవ్‌కు భారీ జరిమానా

మ్యాచ్‌ ఫీజులో 50 శాతం..

తిలక్‌కు 30 శాతం కోత

న్యూఢిల్లీ: ముక్కోణపు వన్డే సిరీ్‌సలో రెండ్రోజుల క్రితం శ్రీలంక ‘ఎ’ జట్టు ఆటగాళ్లతో జరిగిన వివాదానికి సంబంధించి భారత ‘ఎ’ జట్టు స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ రెఫరీ ప్రదీప్‌ జయప్రగాష్‌ సిఫార్సు మేరకు సూర్యవంశీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. అలాగే, అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు భారత ‘ఎ’ కెప్టెన్‌ తిలక్‌ వర్మకు మ్యాచ్‌ ఫీజులో 30 శాతం కోత పడింది. ఈ ఘటనలో శ్రీలంక ఆటగాళ్లు విషేన్‌ హలంబెజ్‌, నిరోషన్‌ డిక్వెల్లాపై కూడా జరిమానా పడింది. విషేన్‌కు 50 శాతం, డిక్వెల్లాకు 20 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. ఈనెల 15న దంబుల్లాలో ఇరుజట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో లంక గెలిచిన సంగతి తెలిసిందే. సూపర్‌ ఓవర్‌లో అవుటై వెళ్తుండగా వైభవ్‌ను ఉద్దేశించి విషేన్‌ ఏదో అనడం, అతడిని వైభవ్‌ బలంగా నెట్టేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 05:29 AM