‘ఎ’ సెలబ్రేషన్..అర్థం అదీ
ABN , Publish Date - May 21 , 2026 | 01:20 AM
యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (38 బంతు ల్లో 93) లఖ్‌నవూతో మంగళవారంనాటి మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు...
జైపూర్: యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (38 బంతు ల్లో 93) లఖ్‌నవూతో మంగళవారంనాటి మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈక్రమంలో హాఫ్ సెంచరీని అతడు వినూత్నంగా..‘ఎ’ ఆకారంలో చేతివేళ్లను చూపించి సెలబ్రేట్ చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. దీనిపై మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ ‘అందులో అర్థం ఏమీలేదు. ప్రతి మ్యాచ్‌కూ ప్రత్యేక తరహాలో సెలబ్రేట్ చేసుకోవాలనేదే అందులో ఉద్దేశం’ అని వివరించాడు. కానీ పదేపదే అడిగే సరికి అసలు విషయం వెల్లడించాడు. లఖ్‌నవూపై ఇన్నింగ్స్ తన తల్లికి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. ‘నా తల్లి పేరు ‘ఎ’ (ఆర్తీ సూర్యవంశీ)తో మొదలవుతుంది. అందుకే ఆ సింబల్’ అని వివరించాడు.
ఇవి కూడా చదవండి:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా