Share News

సూర్యవంశీని యముడిగా..!

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:26 AM

వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసక డబుల్‌ సెంచరీ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇన్‌స్టాలో చేసిన పోస్టు హల్‌చల్‌ చేస్తోంది...

సూర్యవంశీని యముడిగా..!

నెట్టింట జడ్డూ సరదా పోస్టు

న్యూఢిల్లీ: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసక డబుల్‌ సెంచరీ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇన్‌స్టాలో చేసిన పోస్టు హల్‌చల్‌ చేస్తోంది. రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో యూఏఈ బౌలింగ్‌ను ఊచకోత కోసిన వైభవ్‌ 53 బంతుల్లో 204 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఇందులో 7 ఫోర్లు, 28 సిక్స్‌లున్నాయి. అయితే, బౌలర్లపాలిట యముడు అన్నట్టుగా సూర్యవంశీ ఫొటోను ఎడిట్‌ చేసి.. కిరీటం పెట్టాడు. వైభవ్‌.. పురాణాల్లోని యమధర్మరాజును పోలివున్న ఈ ఫొటోను చూసి సరదాగా నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 03:27 AM