Share News

సూపర్‌ సైఫర్ట్‌

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:54 AM

ఓపెనర్‌ టిమ్‌ సైఫర్ట్‌ (42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) సూపర్‌ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌ ప్రపంచక్‌పలో ఘనంగా బోణీ చేసింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఆదివారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో...

సూపర్‌ సైఫర్ట్‌

అఫ్ఘాన్‌పై కివీస్‌ విజయం

చెన్నై: ఓపెనర్‌ టిమ్‌ సైఫర్ట్‌ (42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) సూపర్‌ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌ ప్రపంచక్‌పలో ఘనంగా బోణీ చేసింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఆదివారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. గుల్బదిన్‌ నైబ్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) అర్ధసెంచరీతో సత్తా చాటగా, సెదీఖుల్లా (29), గుర్బాజ్‌ (27), రసూలి (20) ఫర్వాలేదనిపించారు. ఫెర్గూసన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసి గెలిచింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో కివీ్‌సకిదే అత్యధిక ఛేదన. స్పిన్నర్‌ ముజీబుర్‌ (2/31) ధాటికి 14/2 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును సైఫర్ట్‌ భారీ షాట్లతో ఆదుకున్నాడు. అతడికి గ్లెన్‌ ఫిలిప్స్‌ (25 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో 42) జత కలవడంతో మూడో వికెట్‌కు 74 పరుగులు సమకూరాయి. ఆ తర్వాత చాప్‌మన్‌ (28), మిచెల్‌ (25 నాటౌట్‌), కెప్టెన్‌ శాంట్నర్‌ (17 నాటౌట్‌) వేగంగా ఆడి 13 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా సైఫర్ట్‌ నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు: అఫ్ఘానిస్థాన్‌: 20 ఓవర్లలో 182/6 (గుల్బదిన్‌ 63, సెదీఖుల్లా 29; ఫెర్గూసన్‌ 2/40); న్యూజిలాండ్‌: 17.5 ఓవర్లలో 183/5 (సైఫర్ట్‌ 65, ఫిలిప్స్‌ 42, చాప్‌మన్‌ 28; ముజీబుర్‌ 2/31).

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 05:54 AM