3న జట్టులో చేరనున్న తిలక్
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:18 AM
హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) అతడికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. దాంతో తిలక్...
ముంబై: హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈమేరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) అతడికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. దాంతో తిలక్ ఈనెల మూడున ముంబైలో భారత జట్టుతో చేరనున్నాడు. ‘పూర్తిస్థాయి మ్యాచ్ ఆడే ఫిట్‌నె్‌సను తిలక్ వర్మ సంతరించుకున్నాడు’ అని బీసీసీఐ వర్గాలు శనివారం వెల్లడించాయి. తిలక్ పునరాగమనం..మరికొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు టీమిండియాలో జోష్ నింపనుంది. గజ్జల్లో గాయానికి జనవరి 7న శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్ అనంతరం సీవోఈలో పునరావాసం పొందుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు