Share News

సీవీ ఆనంద్‌ శతకం

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:43 AM

హెచ్‌సీఏ ‘సి’ డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ డీజీపీ సికింద్రాబాద్‌ క్లబ్‌ బ్యాటర్‌ సీవీ ఆనంద్‌...

సీవీ ఆనంద్‌ శతకం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హెచ్‌సీఏ ‘సి’ డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ డీజీపీ సికింద్రాబాద్‌ క్లబ్‌ బ్యాటర్‌ సీవీ ఆనంద్‌ అజేయ శతకం (126)తో సత్తాచాటారు. ఆదివారం సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు ఆనంద్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 126 పరుగులు)తో 39 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేసింది. జంషీద్‌ (77), సంజీవ్‌ రెడ్డి (40) కూడా రాణించారు. ఛేదనలో హైదరాబాద్‌ 21.1 ఓవర్లలో 72/3 పరుగుల వద్ద వర్షం అంతరాయం కల్గించడంతో వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్‌ను విజేతగా ప్రకటించారు. ఇక, సీవీ ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసి, కేవలం 8 పరుగులిచ్చారు. డీజీపీ అయిన తర్వాత ఈ సీజన్‌లో ఆనంద్‌ ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌ ఇదే.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:43 AM