గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలేవీ?
ABN , Publish Date - May 28 , 2026 | 02:10 AM
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కేవలం భాగ్యనగరానికే పరిమితమైందనీ, గ్రామీణ క్రికెటర్లను పూర్తిగా విస్మరించిందని...
హెచ్‌సీఏలో పారదర్శకత లోపించిందన్న టీసీఏ
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కేవలం భాగ్యనగరానికే పరిమితమైందనీ, గ్రామీణ క్రికెటర్లను పూర్తిగా విస్మరించిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీసీఏ ప్రతినిధులు, ఆటగాళ్లు, కోచ్‌లు పాల్గొని హెచ్‌సీఏ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయలు తీసుకుంటూ జిల్లా క్రికెటర్లకు సరైన ప్రాతినిథ్యం కల్పించడంలో విఫలమైందన్నారు. పారదర్శకత లేకుండా పాలన చేస్తున్న హెచ్‌సీఏ.. ప్రైవేట్ క్లబ్‌లా వ్యవహరిస్తోందన్నారు. సమావేశంలో గౌరవ్ శర్మ, ప్రేమ్‌కుమార్, నవరసన్ ఆదిత్య, టీసీఏ ఆటగాళ్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజస్థాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్‌హెచ్‌లో వారిద్దరిపై వేటు!
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!