వైభవంగా కుల్దీప్ వివాహం
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:06 AM
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికా చద్దాను శనివారం పెళ్లి చేసుకున్నాడు...
ముస్సోరి: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికా చద్దాను శనివారం పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు ఉదయం స్థానిక రిసార్ట్‌లో ఉదయం జరిగిన హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు ఆరంభం కాగా.. సాయంత్రం అట్టహాసంగా సంగీత్ కార్యక్రమం జరిగింది. అనంతరం బంధువులు, స్నేహితుల సమక్షంలో వైభవంగా సాగిన పెళ్లి వేడుకలో కుల్దీ్‌ప-వన్షికా ఒక్కటయ్యారు. క్రికెటర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, భువనేశ్వర్, చాహల్, టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీ్‌పతో పాటు మాజీ బ్యాటర్ సురేశ్ రైనా హాజరై కుల్దీప్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 17న లఖ్‌నవూలో రిసెప్షన్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..