వెస్టిండీస్ బోణీ
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:04 AM
టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన తమ ప్రారంభ మ్యాచ్‌లో కరీబియన్లు 35 పరుగులతో స్కాట్లాండ్‌పై...
వెస్టిండీస్ బోణీ
రాణించిన హెట్‌మయెర్
షెపర్డ్ హ్యాట్రిక్
35 పరుగులతో స్కాట్లాండ్ పరాజయం
కోల్‌కతా: టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన తమ ప్రారంభ మ్యాచ్‌లో కరీబియన్లు 35 పరుగులతో స్కాట్లాండ్‌పై విజయం సాధించారు. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 182/5 స్కోరు చేసింది. హెట్‌మయెర్ (36 బంతుల్లో 64) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఛేదనలో పేసర్ రొమారియో షెపర్డ్ (5/20) హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 18.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. జాసన్ హోల్డర్ (3/30) మూడు వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!