Share News

టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ పంపిణీ ఇలా..

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:27 AM

ప్రపంచక్‌పనకు సంబంధించిన పూర్తి ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం అధికారికంగా వెల్లడించింది. టోర్నీలో ఆయా జట్ల ప్రదర్శనను...

టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ పంపిణీ ఇలా..

అధికారికంగా వెల్లడించిన ఐసీసీ

దుబాయ్‌: ప్రపంచక్‌పనకు సంబంధించిన పూర్తి ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం అధికారికంగా వెల్లడించింది. టోర్నీలో ఆయా జట్ల ప్రదర్శనను అనుసరించి ఈ ప్రైజ్‌మనీని పంపిణీ చేశామని తెలిపింది. ఐసీసీ ప్రకారం.. ఓవరాల్‌ టోర్నమెంట్‌ ప్రైజ్‌మనీ రూ. 103.92 కోట్లు. చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు రూ. 24.38 కోట్లు లభించగా, రన్నరప్‌ న్యూజిలాండ్‌కు 13.14 కోట్లు దక్కాయి. సెమీఫైనలిస్టులు దక్షిణాఫ్రికా రూ. 9.28 కోట్లు, ఇంగ్లండ్‌ రూ. 9.00 కోట్లు, సూపర్‌-8లో నిష్క్రమించిన వెస్టిండీస్‌ రూ. 4.97 కోట్లు, పాకిస్థాన్‌ రూ. 4.82 కోట్లు, జింబాబ్వే రూ. 4.54 కోట్లు, సంయుక్త ఆతిథ్య జట్టు శ్రీలంక రూ. 4.39 కోట్లు, గ్రూప్‌ దశకే పరిమితమైన అమెరికా, ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌ తలా రూ. 2.86 కోట్లు, స్కాట్లాండ్‌ రూ. 2.57 కోట్లు, ఐర్లాండ్‌ 2.51 కోట్లు.. ఇటలీ, నెదర్లాండ్స్‌, యూఏఈ, నేపాల్‌ తలో రూ. 2.36 కోట్లు.. కెనడా, నమీబియా, ఒమన్‌లు రూ. 2.07 కోట్ల చొప్పున అందుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 12 , 2026 | 05:27 AM