టీ20 వరల్డ్ కప్‌లో కెనడా కివీస్ మ్యాచ్ ఫిక్స్
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:37 AM
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 17న చెన్నైలో న్యూజిలాండ్-కెనడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం దృష్టి సారించింది...
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 17న చెన్నైలో న్యూజిలాండ్-కెనడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి వ్యతిరేక విభాగం దృష్టి సారించింది. ఇందుకు కారణం..కెనడాకు చెందిన పరిశోధనాత్మక కార్యక్రమం ‘ఫిప్త్ ఎస్టేట్’ రూపొందించిన 43 నిమిషాల డాక్యుమెంటరీయే. ఈ మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్‌పై అనుమానం వ్యక్తంజేసింది. ఆ పోరులో కెనడా తొలుత 20 ఓవర్లలో 173/4 స్కోరు చేసింది. అనంతరం కివీస్ 35/2 స్కోరుతో ఉన్న దశలో ఆఫ్ స్పిన్నర్ దిల్‌ప్రీత్ ఆ ఓవర్‌ను నోబ్‌తో ప్రారంభించాడు. మొత్తంగా ఆ ఓవర్లో కెనడా సారథి 15 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ ఫిక్స్ అయ్యిందన్నది ఆ డాక్యుమెంటరీ సారాంశం. కాగా..15.1 ఓవర్లలో ఛేదనను పూర్తి చేసిన న్యూజిలాండ్ సూపర్-8కి చేరింది.
ఇవి కూడా చదవండి:
డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి