Share News

2028 టీ20 వరల్డ్‌ కప్‌..

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:54 AM

తదుపరి (2028) టీ20 వరల్డ్‌ కప్‌లో నేరుగా ప్రవేశం పొందిన జట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో సూపర్‌-8కు...

2028 టీ20 వరల్డ్‌ కప్‌..

ఈ జట్లకు బెర్త్‌లు ఖరారు

చెన్నై: తదుపరి (2028) టీ20 వరల్డ్‌ కప్‌లో నేరుగా ప్రవేశం పొందిన జట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో సూపర్‌-8కు చేరిన జట్లన్నీ తర్వాతి మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించినట్టు తెలిపింది. ఆతిథ్య దేశాల హోదాలో ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌తోపాటు సూపర్‌-8కు అర్హత సాధించిన భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా జట్లు బరిలోకి దిగుతాయి. అలాగే పైజట్ల తర్వాత ఐసీసీ ర్యాంకుల్లో ఉత్తమ స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, ఐర్లాండ్‌ కూడా చేరతాయి. మిగిలిన 8 బెర్తులను రీజినల్‌ క్వాలిఫికేషన్‌ విధానం ద్వారా ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్‌: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

Updated Date - Feb 19 , 2026 | 02:54 AM