Share News

బ్యాట్‌ పట్టుకోవడం రాని వారికి క్రికెట్‌ సంఘాల్లో సభ్యత్వమా?

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:42 AM

ఆటల గురించి ఏమాత్రం తెలియని వారు క్రీడా సంఘాలను పాలించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని...

బ్యాట్‌ పట్టుకోవడం రాని వారికి క్రికెట్‌ సంఘాల్లో సభ్యత్వమా?

  • నిలదీసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఆటల గురించి ఏమాత్రం తెలియని వారు క్రీడా సంఘాలను పాలించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని వారి కంటే.. మాజీ క్రికెటర్లే ఆయా సంఘాలను నిర్వహించాలని పేర్కొంది. మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఎన్నికలపై బాంబే హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ఎత్తివేయాలంటూ దాఖలపై పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. అనంతరం పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించిన న్యాయస్థానం.. అభ్యంతరాలేమైనా ఉంటే బాంబే హైకోర్టులో చెప్పుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:

అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

Updated Date - Feb 04 , 2026 | 05:42 AM