Share News

ఇదేంటి.. కావ్యా !

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:01 AM

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యా మారన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె సహ యజమానిగా ఉన్న ‘ద హండ్రెడ్‌’ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ జట్టు ‘సన్‌రైజర్స్‌ లీడ్స్‌’ పాకిస్థాన్‌ స్పిన్నర్‌...

ఇదేంటి.. కావ్యా !

పాక్‌ స్పిన్నర్‌ను కొనుకున్న ఫ్రాంచైజీ

‘సన్‌రైజర్స్‌ లీడ్స్‌’ యాజమాన్యంపై విమర్శలు

లండన్‌: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యా మారన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె సహ యజమానిగా ఉన్న ‘ద హండ్రెడ్‌’ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ జట్టు ‘సన్‌రైజర్స్‌ లీడ్స్‌’ పాకిస్థాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడాన్ని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. హండ్రెడ్‌ లీగ్‌ పురుషుల టోర్నమెంట్‌ వేలం గురువారం ఇక్కడ జరిగింది. ఈ వేలంలో 27 ఏళ్ల పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ రూ. 2.34 కోట్లకు దక్కించుకుంది. వేలంలో.. ట్రెంట్‌ రాకెటర్స్‌ జట్టుతో హోరాహోరీగా తలపడి మరీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అబ్రార్‌ అహ్మద్‌ను చేజిక్కించుకుంది.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ఎగతాళి చేసి...: గత ఏడాది మేలో పాకిస్థాన్‌పై భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సందర్భంగా అబ్రార్‌ అనుచితంగా ప్రవర్తించాడు. తాను టీ తాగుతున్న ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి ‘అద్భుతమైన టీ’ అని రాశాడు. 2019లో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాకిస్థాన్‌ పట్టుకున్న సంఘటనను గుర్తు చేస్తూ అబ్రార్‌ వ్యంగ్యంగా ఆ పోస్ట్‌ చేశాడు. పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్న సమయంలో.. వర్థమాన్‌ టీ తాగుతున్న చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేసి పరిహాసమాడిన పాకిస్థాన్‌ ప్రజల్లో అబ్రార్‌ కూడా ఉన్నాడు. కాగా పాక్‌ వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ జట్టు కొనుక్కుంది.

ఇవి కూడా చదవండి..

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 13 , 2026 | 03:01 AM