చెన్నైకి రైజర్స్ చెక్
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:55 AM
సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. బౌలర్లు బాధ్యత తీసుకున్నారు. జోరు మీదున్న చెన్నై...
నేటి మ్యాచ్‌లు
కోల్‌కతా X రాజస్థాన్ మ.3.30 (కోల్‌కతా)
పంజాబ్ X లఖ్‌నవూ రా.7.30 (చండీగఢ్)
చెలరేగిన అభిషేక్, క్లాసెన్
మలింగకు మూడు వికెట్లు
10 రన్స్‌తో హైదరాబాద్ విజయం
అభిషేక్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59)
హైదరాబాద్: సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. బౌలర్లు బాధ్యత తీసుకున్నారు. జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను నియంత్రిస్తూ తమ జట్టును ఆఖరి ఓవర్‌లో గట్టెక్కించారు. దీంతో శనివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రైజర్స్ 10 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఆరు పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. అటు చెన్నైకిది ఆరింట్లో నాలుగో ఓటమి. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), క్లాసెన్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) మాత్రమే రాణించారు. పేసర్లు అన్షుల్ కాంబోజ్, ఒవర్టన్‌లకు మూడేసి, ముకేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమై ఓడింది. పేసర్లు ఇషాన్ మలింగ 3, నితీశ్ 2, శివాంగ్, ప్రఫుల్, సకీబ్ తలో వికెట్ తీశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మలింగ నిలిచాడు.
తడబడుతూ..: చెన్నై ఛేదన ఆరంభంలో సజావుగా సాగినా.. ఆ తర్వాత తడబాటుకు గురైంది. ఓపెనర్లు సంజూ శాంసన్ (7), కెప్టెన్ రుతురాజ్ (19) విఫలమయ్యారు. కానీ ఆయుష్ మాత్రే (13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30) మెరుపులతో పవర్‌ప్లేలో చెన్నై 76/3తో నిలిచింది. కానీ మధ్య ఓవర్లలో రైజర్స్ కట్టడి చేసింది. మాథ్యూ షార్ట్ (34), సర్ఫరాజ్ (25) నాలుగో వికెట్‌కు 46 రన్స్ జోడించినా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు. చివర్లో రైజర్స్ బౌలర్లు పట్టు సాధించడంతో శివమ్ దూబే (21) క్రీజులో ఉన్నా భారీషాట్లు ఆడలేక వెనుదిరిగాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 18 రన్స్ అవసరమవగా.. పేసర్ ప్రఫుల్ 7 పరుగులే ఇవ్వడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.
జోరుగా ఆరంభమై..: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ పవర్‌ప్లేలోనే 75 పరుగులతో వహ్వా.. అనిపించింది. స్పిన్నర్ మాథ్యూ షార్ట్ ఓవర్‌లో అభిషేక్ 4,4,4,6,6తో 25 పరుగులు సాధించడంతో 15 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూర్తయ్యింది. ఆ తర్వాత హెడ్ (20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23) హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కానీ పేసర్ ముకేశ్ వరుస బంతుల్లో హెడ్, ఇషాన్ (0)లను అవుట్ చేసి షాకిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక మధ్య ఓవర్లలో పేసర్ ఒవర్టన్.. అభిషేక్, అనికేత్ (2), నితీశ్ (12)ల వికెట్లతో రైజర్స్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. ఈ స్థితిలో వెటరన్ క్లాసెన్ నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే డెత్ ఓవర్లలో చెన్నై పేసర్లు మరింతగా పుంజుకోవడంతో చివరి మూడు ఓవర్లలో సన్‌రైజర్స్ 17 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: అభిషేక్ (సి) శాంసన్ (బి) ఒవర్టన్ 59, హెడ్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 23, ఇషాన్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 0, క్లాసెన్ (బి) అన్షుల్ 59, అనికేత్ (సి) నూర్ (బి) ఒవర్టన్ 2, నితీశ్ (సి) షార్ట్ (బి) ఒవర్టన్ 12, సలీల్ (సి) బ్రెవిస్ (బి) గుర్జాపనీత్ 13, లివింగ్‌స్టోన్ (సి) బ్రెవిస్ (బి) అన్షుల్ 1, శివాంగ్ (సి) గుర్జాపనీత్ (బి) అన్షుల్ 12, ప్రఫుల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 194/9; వికెట్ల పతనం: 1-75, 2-75, 3-93, 4-112, 5-147, 6-177, 7-179, 8-193, 9-194; బౌలింగ్: షార్ట్ 3-0-38-0, ముకేశ్ 2-0-21-2, అన్షుల్ 3-0-22-3, నూర్ అహ్మద్ 4-0-33-0, ఒవర్టన్ 4-0-37-3, గుర్జాపనీత్ 4-0-34-1.
చెన్నై: సంజూ శాంసన్ (సి) క్లాసెన్ (బి) నితీశ్ 7, రుతురాజ్ (సి) సలీల్ (బి) మలింగ 19, మాత్రే (సి) క్లాసెన్ (బి) నితీశ్ 30, షార్ట్ (సి) అనికేత్ (బి) మలింగ 34, సర్ఫరాజ్ (సి) నితీశ్ (బి) మలింగ 25, బ్రెవిస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శివాంగ్ 0, శివమ్ దూబే (బి) సకీబ్ 21, ఒవర్టన్ (సి) లివింగ్‌స్టోన్ (బి) ప్రఫుల్ 16, అన్షుల్ (నాటౌట్) 13, నూర్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 184/8; వికెట్ల పతనం: 1-15, 2-66, 3-66, 4-112, 5-113, 6-148, 7-154, 8-182; బౌలింగ్: ప్రఫుల్ హింగే 4-0-60-1, నితీశ్ 4-0-31-2, సకీబ్ హుస్సేన్ 4-0-32-1, ఇషాన్ మలింగ 4-0-29-3, శివాంగ్ 3-0-18-1, అభిషేక్ 1-0-13-0.
1
సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (15 బంతుల్లో)ని నమోదు చేసిన అభిషేక్. అలాగే ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లోనే (1193) 2 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్. ఆండ్రీ రస్సెల్ (1120) టాప్‌లో ఉన్నాడు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 5 4 0 1 9 1.067
బెంగళూరు 6 4 2 0 8 1.171
రాజస్థాన్ 5 4 1 0 8 0.889
హైదరాబాద్ 6 3 3 0 6 0.566
ఢిల్లీ 5 3 2 0 6 0.310
గుజరాత్ 5 3 2 0 6 0.018
చెన్నై 6 2 4 0 4 -0.780
లఖ్‌నవూ 5 2 3 0 4 -0.804
ముంబై 5 1 4 0 2 -1.076
కోల్‌కతా 6 0 5 1 1 -1.149
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!