Share News

సుదీప్‌ ‘డబుల్‌’

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:48 AM

ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో బెంగాల్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. సుదీప్‌ కుమార్‌ (216 బ్యాటింగ్‌) అజేయ డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో, మూడో రోజు..

సుదీప్‌ ‘డబుల్‌’

బెంగాల్‌ 418/6 జూ ఆంధ్రతో రంజీ క్వార్టర్స్‌

కళ్యాణి: ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో బెంగాల్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. సుదీప్‌ కుమార్‌ (216 బ్యాటింగ్‌) అజేయ డబుల్‌ సెంచరీతో అదరగొట్టడంతో, మూడో రోజు బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 418/6 స్కోరు సాధించింది. సుమంత గుప్త (81) అర్ధసెంచరీ చేశాడు. సౌరభ్‌, శశికాంత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్రస్తుతం బెంగాల్‌ 123 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 199/5తో ఆదివారం బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించగా.. సుదీ్‌ప-సుమంత జోడీ ఆరో వికెట్‌కు 165 పరుగులు జోడించింది. ఆ తర్వాత షకీర్‌ హబీబ్‌ (45 బ్యాటింగ్‌)తో ఏడో వికెట్‌కు సుదీప్‌ అజేయంగా 100 రన్స్‌ జత చేశాడు. అంతకుముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 05:48 AM