సత్తా చాటిన సుభాష్
ABN , Publish Date - Jul 23 , 2026 | 02:07 AM
తెలుగు పేసర్ చిగురుపాటి సుభాష్ భారత్, శ్రీలంక అండర్-19 యూత్ రెండో టెస్టులో బంతితో మెరిశాడు...
కొలంబో: తెలుగు పేసర్ చిగురుపాటి సుభాష్ భారత్, శ్రీలంక అండర్-19 యూత్ రెండో టెస్టులో బంతితో మెరిశాడు. ఆటకు మూడో రోజైన బుధవారం సుభాష్ మూడు వికెట్ల (3/25)తో సత్తా చాటాడు. ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్లకు 155 రన్స్ చేసింది. విజయానికి లంక చివరి రోజు ఆటలో 317 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 208/3 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 411 పరుగులకు ఆలౌట్ కాగా, లంక 148కే కుప్పకూలింది.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి