Share News

అందుకే రోహిత్‌కు సారీ చెప్పా!

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:46 AM

ధోనీ సారథ్యంలో భారత్‌ 2011 వన్డే వరల్డ్‌క్‌పను సొంతం చేసుకొంది. అయితే, ఆ వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ శర్మకు చోటు దక్కకపోవడం పెద్ద షాక్‌గా భావించాలి. ఈ విషయమై తాను...

అందుకే రోహిత్‌కు సారీ చెప్పా!

మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ శ్రీకాంత్‌

న్యూఢిల్లీ: ధోనీ సారథ్యంలో భారత్‌ 2011 వన్డే వరల్డ్‌క్‌పను సొంతం చేసుకొంది. అయితే, ఆ వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ శర్మకు చోటు దక్కకపోవడం పెద్ద షాక్‌గా భావించాలి. ఈ విషయమై తాను ఇప్పటికీ చింతిస్తున్నానని అప్పటి బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ చెప్పాడు. అంతేకాకుండా ఈ విషయమై రోహిత్‌కు క్షమాపణలు కూడా చెప్పానని గుర్తు చేసుకొన్నాడు. జట్టులో సమతుల్యం కోసం ఓ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలనుకోవడంతోనే రోహిత్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు. నిజానికి 1983 వరల్డ్‌కప్‌ స్ఫూర్తితో 2011లోనూ ఎంపికచేశామన్నాడు. అప్పట్లో శ్రీకాంత్‌, కిర్మాణీ, గవాస్కర్‌ తప్ప అందరూ బౌలింగ్‌ చేసినవాళ్లేనన్నాడు. 2011లో మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు కూడా ఆల్‌రౌండర్‌ అయిన యువరాజ్‌ సింగ్‌కే దక్కిన విషయాన్ని శ్రీకాంత్‌ గుర్తు చేశాడు.

ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 23 , 2026 | 01:46 AM