అమీతుమీ
ABN , Publish Date - May 27 , 2026 | 03:11 AM
అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ ఓ వైపు.. 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అతిగా...
నేడు ఎలిమినేటర్
రైజర్స్ X రాయల్స్
రాత్రి 7.30 నుంచి
ఓడిన జట్టు ఇంటికే
ముల్లన్‌పూర్: అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ ఓ వైపు.. 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అతిగా ఆధారపడిన రాజస్థాన్ రాయల్స్ మరో వైపున బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరో అవకాశం లభిస్తుంది. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమించాల్సిందే. ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌ను రెండుసార్లు ఓడించిన రైజర్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. టాపార్డర్‌లో అభిషేక్, హెడ్, ఇషాన్‌లతో పాటు మిడిలార్డర్‌లో క్లాసెన్, నితీశ్, అనికేత్‌లతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా కనిపిస్తోంది. అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో బౌలింగ్ మరింత బలంగా మారింది. ఎషాన్ మలింగ, సకీబ్, ప్రఫుల్ అతడికి సహకరిస్తున్నారు. స్పిన్నర్ హర్ష్ దూబే కీలకం కానున్నాడు. అటు ఓపెనర్ వైభవ్ హిట్టింగ్‌పై రాయల్స్ ఆశలు పెట్టుకుంది. మరో ఓపెనర్ జైస్వాల్ ఆటలో నిలకడలేమి కనిపిస్తోంది. జురెల్, పరాగ్ క్రీజులో నిలిస్తే విజయావకాశాలుంటాయి. అలాగే పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ రైజర్స్ బ్యాటర్లను ఏమేరకు అడ్డుకోగలరో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి ఊహించని ప్లేయర్!
కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!