ఉప్పల్‌లో బోణీ కోసం..
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:31 AM
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఆదివారం ఉప్పల్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే...
లఖ్‌నవూతో హైదరాబాద్ పోరు నేడు
హైదరాబాద్: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఆదివారం ఉప్పల్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌హెచ్ ఒక ఓటమి, ఒక విజయంతో ఉంది. తమ చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టడంతో పాటు బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. హెడ్, అభిషేక్, కెప్టెన్ ఇషాన్, క్లాసెన్, నితీశ్ ఫామ్‌లో ఉండడంతో.. లఖ్‌నవూపైనా చెలరేగి సొంత ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. అటు బోణీ కోసం ఎదురుచూస్తున్న లఖ్‌నవూ తమ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడింది. ఈనేపథ్యంలో హిట్టర్లతో కూడిన రైజర్స్‌ను పంత్ సేన ఏమేరకు నిలువరిస్తుందో వేచిచూడాల్సిందే.
ఆస్ట్రేలియాకు కమిన్స్: రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కోల్‌కతాతో తమ ఆరంభ మ్యాచ్ తర్వాత అతను స్వదేశానికి వెళ్లాడు. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్‌కు కికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆధ్వర్యంలో చివరిసారి స్కానింగ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు