Share News

చెలరేగిన ‘సౌత్‌’ బౌలర్లు

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:45 AM

పేసర్‌ విద్వత్‌ కావేరప్ప (4/66) నిప్పులు చెరగడంతో.. నార్త్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ సెమీ్‌సలో సౌత్‌జోన్‌ పైచేయి సాధించింది. ఆదివారం ఆరంభమైన మ్యాచ్‌లో నార్త్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో...

చెలరేగిన ‘సౌత్‌’ బౌలర్లు

నార్త్‌జోన్‌ 195 ఆలౌట్‌

  • కావేరప్పకు 4 వికెట్లు

  • దులీప్‌ ట్రోఫీ సెమీస్‌

బెంగళూరు: పేసర్‌ విద్వత్‌ కావేరప్ప (4/66) నిప్పులు చెరగడంతో.. నార్త్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ సెమీ్‌సలో సౌత్‌జోన్‌ పైచేయి సాధించింది. ఆదివారం ఆరంభమైన మ్యాచ్‌లో నార్త్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది. తనయ్‌ త్యాగరాజన్‌, నిదీశ్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. అనంతరం సౌత్‌జోన్‌ 40/2 స్కోరు చేసింది. రికీ భుయ్‌ (5)ను కాంబోజ్‌ వెనక్కిపంపగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షేక్‌ రషీద్‌ (0)ను గుర్నూర్‌ డకౌట్‌ చేశాడు. నార్త్‌జోన్‌ స్కోరుకు సౌత్‌జోన్‌ ఇంకా 155 పరుగులు వెనుకంజలో ఉంది.

రింకూ అర్ధ శతకం

రింకూ సింగ్‌ (60) అర్ధ శతకంతో రాణించినా.. పేసర్లు ముకేశ్‌ కుమార్‌ (3/56), అభిజిత్‌ సర్కార్‌ (3/38) మూడేసి వికెట్లతో విజృంభించారు. దీంతో ఈస్ట్‌జోన్‌తో సెమీ్‌సలో సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్‌ షమి రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్‌ సారథి ఇషాన్‌ కిషన్‌ వేలి గాయంతో మైదానాన్ని వీడడంతో.. టీనేజ్‌ సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొలిసారి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా ఆర్యన్‌ క్యాచ్‌ విషయంలో రివ్యూ తీసుకొని విజయం సాధించాడు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:45 AM