తొలి అడుగు.. ఎవరిదో?
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:56 AM
టీ20 వరల్డ్‌కప్ కీలక దశకు చేరింది. టైటిల్ విజేతను తేల్చేందుకు ఇక మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో బుధవారం సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. ముందుగా...
టీ20 వరల్డ్‌కప్
రాత్రి 7 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఫేవరెట్ దక్షిణాఫ్రికా
కివీస్‌కు సవాల్
నేడు తొలి సెమీస్
కోల్‌కతా: టీ20 వరల్డ్‌కప్ కీలక దశకు చేరింది. టైటిల్ విజేతను తేల్చేందుకు ఇక మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో బుధవారం సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. ముందుగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టోర్నీలో తామాడిన ఏడు మ్యాచ్‌ల్లో సఫారీలకు ఓటమన్నదే లేదు. ఇక, ఈ పోరులోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న మార్‌క్రమ్ బృందం.. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది. న్యూజిలాండ్ మాత్రం కాస్త తడబడుతూనే ఇక్కడిదాకా రాగలిగింది. అలాగే గ్రూప్ ‘డి’లో ఇదివరకే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. కానీ ఈ నాకౌట్ పోరులో పూర్తి స్థాయిలో చెలరేగి గ్రూప్ దశలో ఓటమికి బదులివ్వడమే కాకుండా, తుదిపోరుకు సైతం కివీస్ అర్హత సాధించాలనుకుంటోంది.
స్పిన్నర్లే బలంగా..
ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేస్తే ప్రమాదం తప్పదు. ఓపెనర్లు సైఫర్ట్, ఆలెన్ కుదురుకుంటే పరుగుల వరద ఖాయం. అలాగే గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, రచిన్ చివర్లో శాంట్నర్‌లతో కివీస్ బ్యాటింగ్‌కు తిరుగులేదు. అటు బౌలింగ్‌లో పేసర్ మ్యాట్ హెన్రీ తొలి ఓవర్‌లోనే వికెట్ తీయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. అతడికి జతగా ఫెర్గూసన్ చెలరేగుతుండడంతో పవర్‌ప్లేలో సఫారీలను అడ్డుకుంటే కివీస్ పైచేయి సాధిస్తుందనడంలో సందేహం లేదు. శాంట్నర్, రచిన్, ఫిలిప్స్, మెకాంచీ, సోధీ రూపంలో ఐదుగురు స్పిన్నర్లు ఉండడం జట్టుకు లాభించే అంశం. అయితే మెకాంచీ స్థానంలో మరో పేసర్ డఫీని తీసుకునే అవకాశం ఉంది. అన్ని విభాగాలు సమష్టిగా రాణిస్తే సౌతాఫ్రికాను ఓడించడం కివీస్‌కు ఏమంత కష్టం కాదు.
అన్నింటా బలంగా..
దక్షిణాఫ్రికా జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌లోనూ విధ్వంసం సృష్టించగల బ్యాటర్లకు కొదువ లేదు. అయితే ఓపెనర్ డికాక్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాకపోవడం లోటుగా ఉంది. కానీ మార్‌క్రమ్ పవర్‌ప్లేలో బాదుడుకు జట్టు ఆరంభం నుంచే దూసుకెళ్తోంది. వెటరన్ మిల్లర్ నిలకడగా రాణిస్తున్నాడు. అలాగే యువ ఆటగాళ్లు బ్రెవిస్, స్టబ్స్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. పేసర్ ఎన్‌గిడి, యాన్సెన్ ప్రత్యర్థి బ్యాటర్లను కుదురుకోనీయడం లేదు. ముఖ్యంగా ఎన్‌గిడి తన స్లో బంతులు, వైడ్ యార్కర్లతో అద్భుతంగా కట్టడి చేస్తున్నాడు. సీనియర్ పేసర్ రబాడ చెలరేగితే కివీస్‌కు కష్టాలు తప్పవు. జట్టులో కేశవ్ మహరాజ్ ఏకైక స్పిన్నర్‌గా ఉండగా, మార్‌క్రమ్ పార్ట్‌టైమ్ బౌలింగ్ కూడా జట్టుకు ఉపయోగపడనుంది.
తుది జట్లు (అంచనా)
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎన్‌గిడి.
న్యూజిలాండ్: సైఫర్ట్, ఆలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), హెన్రీ, మెకాంచీ/డఫీ, ఇష్ సోధీ, ఫెర్గూసన్.
పిచ్, వాతావరణం
ఈడెన్ గార్డెన్ వికెట్ ఎప్పటిలాగే బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో బౌలర్లకు చక్కటి బౌన్స్ కూడా లభించనుంది. సమయం గడిచేకొద్దీ స్పిన్నర్లకు అవకాశముంటుంది. మంచు ప్రభావం కూడా ఉండడంతో ఛేజింగ్ జట్టుకు విజయావకాశాలు ఎక్కువ. మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయినా రిజర్వ్ డే ఉంటుంది.
టీ20 వరల్డ్‌క్‌పల్లో న్యూజిలాండ్‌తో తలపడిన ఐదుసార్లూ దక్షిణాఫ్రికానే గెలిచింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి