రాత మారలేదు..
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:18 AM
పాత కథే పునరావృతమైంది.. దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన సఫారీలు.. సెమీస్‌లో...
పాత కథే పునరావృతమైంది.. దక్షిణాఫ్రికా మరోసారి నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన సఫారీలు.. సెమీస్‌లో మాత్రం ఒక్కసారిగా డీలాపడ్డారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇలా ఇంటిముఖం పట్టడం 1999 నుంచి సఫారీలను వెంటాడుతోంది. ఈ టీ20 వరల్డ్‌క్‌పనకు వచ్చినప్పుడు సౌతాఫ్రికా కోచ్ షుక్రి చరిత్రను తిరగరాస్తామన్నాడు. కానీ, ఈసారి కూడా సఫారీలు రాత మారలేదు.
1999: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు సాధించలేక.. దక్షిణాఫ్రికా ఇంటిముఖం పట్టింది. ఆ మ్యాచ్‌లో అలెన్ డొనాల్డ్ రనౌట్ అయ్యాడు.
2003: సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌క్‌పలో వర్షం కారణంగా గ్రూప్ దశలోనే అవుటైంది. రూల్స్‌ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే భారీ మూల్యం చెల్లించుకొంది.
2015: సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం.
2023: మరోసారి సెమీ్‌సలోనే ఇంటిముఖం.
2024 టీ20 వరల్డ్‌కప్: ఫైనల్లో భారత్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి.
2026 టీ20 వరల్డ్‌కప్: సెమీ్‌సలో న్యూజిలాండ్ చేతిలో చిత్తు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!
ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు