సఫారీల హ్యాట్రిక్
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:19 AM
టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. కెప్టెన్ మార్‌క్రమ్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో.. శనివారం...
మార్‌క్రమ్ మెరుపు ఇన్నింగ్స్
కివీస్ పరాజయం
అహ్మదాబాద్: టీ20 వరల్డ్‌క్‌పలో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. కెప్టెన్ మార్‌క్రమ్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో.. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో నెగ్గింది. సఫారీలకిది వరుసగా మూడో విజయం. దీంతో దక్షిణాఫ్రికా జట్టు గ్రూప్ ‘డి’లో ఆరు పాయింట్లతో దాదాపు సూపర్ ‘8’ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 175/7 స్కోరు చేసింది. చాప్‌మన్ (48), మిచెల్ (32), ఆలెన్ (31), నీషమ్ (23 నాటౌట్) రాణించారు. పేసర్ యాన్సెన్‌కు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో 178/3 స్కోరు చేసి గెలిచింది. మిల్లర్ (24 నాటౌట్), రికెల్టన్ (21), బ్రెవిస్ (21), డికాక్ (20) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా యాన్సెన్ నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 175/7 (చాప్‌మన్ 48, మిచెల్ 32, ఆలెన్ 31, నీషమ్ 23 నాటౌట్; యాన్సెన్ 4/40);
దక్షిణాఫ్రికా: 17.1 ఓవర్లలో 178/3 (మార్‌క్రమ్ 86 నాటౌట్, మిల్లర్ 24 నాటౌట్; రచిన్ 1/9, నీషమ్ 1/15).
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం
భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?