సఫారీల జైత్రయాత్ర
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:57 AM
టీ20 ప్రపంచక్‌ప గ్రూప్ దశను దక్షిణాఫ్రికా ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న సఫారీలు..
యూఏఈ చిత్తు
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచక్‌ప గ్రూప్ దశను దక్షిణాఫ్రికా ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న సఫారీలు.. గ్రూప్-డిలో భాగంగా బుధవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో ఆరు వికెట్లతో యూఏఈ జట్టును చిత్తు చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులకే పరిమితమైంది. షరాఫు (45) టాప్ స్కోరర్. బాష్ (3/12) సూపర్ స్పెల్‌తో యూఏఈ బ్యాటర్ల భరతం పట్టగా.. నోకియా (2/28), జార్జ్ లిండే (1/17) ఆకట్టుకున్నారు. స్వల్ప ఛేదనలో దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే 123/4 స్కోరు చేసి గెలిచింది. బ్రెవిస్ (36), రికెల్టన్ (30), మార్‌క్రమ్ (28) రాణించారు. బాష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ ఓటమితో టోర్నీలో యూఈఏ పోరాటం ముగిసింది. ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఇప్పటికే సూపర్-8కు చేరాయి.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఫర్హాన్ సూపర్ సెంచరీ.. నమీబియా టార్గెట్ 200
జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్