Share News

హర్మన్‌సేన ఓటమి

ABN , Publish Date - Apr 18 , 2026 | 02:34 AM

దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు...

హర్మన్‌సేన ఓటమి

దక్షిణాఫ్రికాదే తొలి టీ20

డర్బన్‌: దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్‌ సేనపై గెలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (47 నాటౌట్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (36), షఫాలీ వర్మ (34) రాణించారు. స్మృతీ మంధాన (13) నిరాశపరిచింది. ఖాఖ మూడు, సెఖుఖునె రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 158/4 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్‌, ఓపెనర్‌ లారా వోల్వార్ట్‌ (51) అర్ధ సెంచరీతో సత్తా చాటగా.. ఆఖర్లో డెర్క్‌సెన్‌ (44 నాటౌట్‌), ట్రయాన్‌ (18 నాటౌట్‌) అదరగొట్టారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 2 వికెట్లు తీసింది.

ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 18 , 2026 | 02:34 AM