సఫారీలు సిరీస్ పట్టేశారు
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:01 AM
మిల్లర్ (142), కెప్టెన్ బవుమా (103) శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 32 రన్స్‌తో నెగ్గింది...
మిల్లర్, బవుమా శతక మోత
జొహాన్నె్‌సబర్గ్: మిల్లర్ (142), కెప్టెన్ బవుమా (103) శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 32 రన్స్‌తో నెగ్గింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో వన్డే ఉండగానే సఫారీలు సొంతం చేసుకున్నారు. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 365/9 స్కోరు చేసింది. జాక్ ఎడ్వర్డ్స్ (5/67) ఐదు వికెట్లతో విజృంభించాడు. హాజెల్‌వుడ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ 49.1 ఓవర్లలో 333 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్లు మార్ష్ (84), హెడ్ (84) తొలి వికెట్‌కు 130 రన్స్‌తో మెరుపు ఆరంభాన్ని చ్చినా ఫలితం లేకపోయింది. విలియమ్స్ 3, యాన్సెన్, కేశవ్, ఫోర్ట్యూయిన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే