తొలి వన్డే దక్షిణాఫ్రికాదే
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:28 AM
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో...
డర్బన్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 67 పరుగులతో నెగ్గింది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 297/8 స్కోరు చేసింది. మాథ్యూ బ్రీజ్కే (112) సెంచరీతో చెలరేగాడు. ఛేదనలో ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగుల కు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (60) అర్ధ శతకం సాధించాడు. కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ వార్తలనూ చదవండి:
వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..