Share News

అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:06 AM

అరంగేట్ర వన్డేలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ జోర్డాన్‌ హెర్మన్‌ (126 బంతుల్లో 150) అత్యధిక స్కోరుతో...

 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు

దక్షిణాఫ్రికా బ్యాటర్‌ జోర్డాన్‌ ఘనత

విండ్‌హోక్‌ (నమీబియా): అరంగేట్ర వన్డేలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్‌ జోర్డాన్‌ హెర్మన్‌ (126 బంతుల్లో 150) అత్యధిక స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. నమీబియాతో మ్యాచ్‌లో హెర్మన్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ క్రమంతో తమ దేశానికే చెందిన మాథ్యూ బ్రిట్జ్క్‌ (148 బంతుల్లో 150) న్యూజిలాండ్‌పై నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. హెర్మన్‌ భారీ శతకంతో తొలుత దక్షిణాఫ్రికా 348/6 స్కోరు చేసింది. అనంతరం నమీబియా ఛేదనలో వర్షం ఆటంకం కలిగించడంతో లక్ష్యాన్ని 31 ఓవర్లలో 262 పరుగులుగా నిర్దేశించారు. కానీ, నమీబియా 162/8 స్కోరుకే పరిమితమై ఓటమి పాలైంది.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 05:06 AM