భారత మహిళలతో టీ20 సిరీస్
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:19 AM
ఈ ఏడాది చివర్లో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగే సిరీస్ షెడ్యూల్‌లో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎ్‌సఏ) మార్పులు..
షెడ్యూల్‌ను మార్చిన దక్షిణాఫ్రికా
జొహాన్నె్‌సబర్గ్: ఈ ఏడాది చివర్లో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగే సిరీస్ షెడ్యూల్‌లో క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎ్‌సఏ) మార్పులు చేసింది. ఇరు జట్ల మధ్య ఒక టెస్టు, మూడు వన్డేలు జరుగుతాయని గతంలో ప్రకటించగా, తాజాగా ఇందులో మూడు టీ20లను కూడా చేర్చారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఇరు జట్లు డిసెంబరు 9-12 మధ్య టెస్టు, 16-22 మధ్య మూడు వన్డేలు, 26-30 మధ్య మూడు టీ20లు ఆడబోతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆరంభ ఐసీసీ మహిళల చాంపియన్స్ ట్రోఫీకి పొట్టి సిరీస్ సన్నాహకంగా ఉంటుందని సీఎ్‌సఏ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ