కలిసిపోయిన మంధాన, పలాష్ కుటుంబాలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:34 AM
టీమిండియా స్టార్ స్మృతీ మంధాన, ఆమె మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ కుటుంబాల మధ్య గొడవలు సమసిపోయాయా? మంధాన, పలాష్ మళ్లీ కలిసిపోయారని...
ముంబై: టీమిండియా స్టార్ స్మృతీ మంధాన, ఆమె మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ కుటుంబాల మధ్య గొడవలు సమసిపోయాయా? మంధాన, పలాష్ మళ్లీ కలిసిపోయారని.. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగనుందా? అంటే.. ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యం అంటూ నెట్టింట పుకార్లు ఊపందుకున్నాయి. పలాష్ సోదరి పాలక్ ముచ్చల్‌తో స్మృతీ మంధాన తండ్రి శ్రీనివాస్ ఆప్యాయంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. పాలక్ గౌరవంగా మంధాన తండ్రి కాళ్లకు నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగానూ ఆ వీడియోలో ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఇరుకుటుంబాల మధ్య బంధాలు తిరిగి చిగురించాయనేందుకు ఈ వీడియోనే సంకేతం అని చెప్పుకొంటున్నారు. ఆరేళ్లుగా ప్రేమించుకున్న మంధాన, పలాష్.. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి హల్దీ, మెహందీ వేడుకలు కూడా ఘనంగా జరిగినా, అనూహ్యంగా ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. పలాష్ మరో అమ్మాయితో చాటింగ్ చేసినట్టుగా ఉన్న స్ర్కీన్‌షాట్లు బహిర్గతమవడంతోనే అతనితో పెళ్లిని మంధాన రద్దు చేసుకుందన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య