మంధాన మెరుపుల్
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:37 AM
ఓవైపు ఫుట్‌బాల్ ప్రపంచక్‌పలో మెస్సీ, ఎంబప్పే సంచలనాలతో హోరెత్తిస్తే...మరోవైపు భారత క్రికెటర్లు చెలరేగిపోయారు. అటు అబ్బాయిలు...ఇటు అమ్మాయిలు...మధ్యలో కుర్రాళ్లు...
మహిళల టీ20
ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X స్కాట్లాండ్
(రాత్రి 11 గం. నుంచి)
భారత్‌కు మరో భారీ విజయం
95 రన్స్‌తో నెదర్లాండ్స్ ఓటమి
శ్రీచరణికి నాలుగు వికెట్లు
క్రికెట్‌లో విజయాలే విజయాలు
ఓవైపు ఫుట్‌బాల్ ప్రపంచక్‌పలో మెస్సీ, ఎంబప్పే సంచలనాలతో హోరెత్తిస్తే...మరోవైపు భారత క్రికెటర్లు చెలరేగిపోయారు. అటు అబ్బాయిలు...ఇటు అమ్మాయిలు...మధ్యలో కుర్రాళ్లు...మొత్తంగా బుధవారం భారత క్రికెట్‌లో అన్నీ విజయాలే. అఫ్ఘానిస్థాన్ జట్లతో సీనియర్ జట్టు, ఇండియా-ఏ జట్టు నెగ్గగా, మహిళల ప్రపంచక్‌పలో హర్మన్‌ప్రీత్‌కౌర్ సేన నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది.
లీడ్స్: మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు అదరగొడుతోంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 74) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (38 బంతుల్లో 10 ఫోర్లతో 55; 3/20) ఆల్‌రౌండ్ షో కనబర్చింది. ఇక బౌలింగ్‌లో ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి (4/19) ప్రత్యర్థిని వణికించగా, బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో భారీవిజయం అందుకుంది. ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో హర్మన్ సేన నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. రిచా (8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 20 నాటౌట్) చివర్లో వేగం చూపింది. డి లాంగేకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ డి లీడ్ (28), సీగెర్స్ (21) మినహా అంతా విఫలమయ్యారు. షఫాలీకి మూడు, నందినికి రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా మంధాన నిలిచింది.
స్కోరుబోర్డు: భారత్: మంధాన (సి) జ్విల్లింగ్ (బి) డి లాంగె 74, షఫాలీ (సి) జ్విల్లింగ్ (బి) సీగెర్స్ 55, జెమీమా (సి) డి లీడ్స్ (బి) వాన్ డెర్ రాడ్ 19, రిచా (నాటౌట్) 20, యాస్తిక (స్టంప్) డి లీడ్ (బి) డి లాంగె 3, హర్మన్ (సి) రాబిన్ (బి) జ్విల్లింగ్ 12, దీప్తి (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 209/5. వికెట్ల పతనం: 1-115, 2-162, 3-162, 4-168, 5-199. బౌలింగ్: జ్విల్లింగ్ 4-0-41-1, సీగెర్స్ 2-0-31-1, వోనింగ్ 2-0-25-0, వాన్ డర్ రాడ్ 4-0-37-1, సీగెర్స్ 3-0-32-0, డి లాంగె 4-0-32-2, ఓవర్‌డిక్ 1-0-10-0.
నెదర్లాండ్స్: సీగెర్స్ (సి) మంధాన (బి) నందిని 21, మోల్కెన్‌బోర్ (సి) జెమీమా (బి) దీప్తి 15, డి లీడ్ (స్టంప్) రిచా (బి) నందిని 28, కాలిస్ (బి) షఫాలీ 18, రిజికె (ఎల్బీ) శ్రీచరణి 8, ఓవర్‌డిక్ (సి) మంధాన (బి) శ్రీచరణి 9, జ్విల్లింగ్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 8, వాన్ డర్ రాడ్ (సి) రిచా (బి) శ్రీచరణి 0, సిల్వర్ సీగెర్స్ (స్టంప్) రిచా (బి) షఫాలీ 1, డి లాంగె (నాటౌట్) 0, వోనింగ్ (సి) జెమీమా (బి) షఫాలీ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 17.3 ఓవర్లలో 114 ఆలౌట్. వికెట్ల పతనం: 1-34, 2-50, 3-77, 4-96, 5-98, 6-113, 7-113, 8-114, 9-114, 10-114. బౌలింగ్: క్రాంతి 4-0-26-0, నందిని 3-0-22-2, షఫాలీ 3.2-0-20-3, శ్రేయాంక 0.1-0-0-0, శ్రీచరణి 4-0-19-4, దీప్తి 3-0-26-1.
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత్ అత్యధిక స్కోరు (209) సాధించడంతో పాటు ఇదే అతి భారీ విజయం (95 రన్స్).
ఈ మెగా టోర్నీలో ఎక్కువ హాఫ్ సెంచరీలు (6) సాధించిన భారత బ్యాటర్‌గా స్మృతీ మంధాన.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్