మంధానకు టాప్ ర్యాంక్
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:48 AM
టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేలలో సత్తా చాటిన...
దుబాయ్: టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేలలో సత్తా చాటిన మంధాన 790 పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్ (782)ను వెనక్కు నెట్టింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (652) నాలుగు ర్యాంక్‌లు మెరుగై తొమ్మిదో స్థానంలో నిలవగా.. జెమీమా 12వ ర్యాంక్ దక్కించుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తీశర్మ తొమ్మిదో ర్యాంక్ సాధించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి