Share News

గిల్‌ మళ్లీ నెం.1 వన్డే ర్యాంకింగ్స్‌

ABN , Publish Date - Jul 30 , 2026 | 04:05 AM

భారత జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆరు నెలల తర్వాత వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు. ఇక యువ బ్యాటింగ్‌...

గిల్‌ మళ్లీ నెం.1 వన్డే ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: భారత జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆరు నెలల తర్వాత వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు. ఇక యువ బ్యాటింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ టీ20లలో ఏకంగా 230 స్థానాలు మెరుగై 48వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్‌ మిచెల్‌ను వెనక్కు నెట్టిన గిల్‌ (801 పాయింట్లు) టాప్‌ ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు. గత జనవరి నుంచి డారిల్‌ ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వేపై సిరీ్‌సలో రెండు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్‌ 48వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (910 పాయింట్లు) అగ్ర స్థానంలో నిలిచాడు. తిలక్‌ వర్మ రెండు స్థానాలు మెరుగై ఆరో ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 04:05 AM