Share News

గిల్‌.. జిగేల్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 02:47 AM

రెండు ఓటములతో ఈ ఐపీఎల్‌ను ఆరంభించిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్రస్తుతం నిలకడగా దూసుకెళ్తోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86) కళాత్మక బ్యాటింగ్‌తో...

గిల్‌.. జిగేల్‌

నేటి మ్యాచ్‌లు

బెంగళూరు X ఢిల్లీ మ.3.30 (బెంగళూరు)

సన్‌రైజర్స్‌ X చెన్నై రా.7.30 (హైదరాబాద్‌)

గుజరాత్‌ను గెలిపించిన కెప్టెన్‌

  • కోల్‌కతాకు ఐదో ఓటమి

  • గ్రీన్‌ పోరాటం వృథా

అహ్మదాబాద్‌: రెండు ఓటములతో ఈ ఐపీఎల్‌ను ఆరంభించిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్రస్తుతం నిలకడగా దూసుకెళ్తోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86) కళాత్మక బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గిం ది. జీటీకిది హ్యాట్రిక్‌ విజయం కాగా.. అటు కేకేఆర్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒకటి వర్షంతో రద్దుకాగా, మిగిలిన ఐదింటిలోనూ ఓడింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందు గా కోల్‌కతా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్‌ గ్రీన్‌ (55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79), పోవెల్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27) మాత్రమే రాణించారు. రబాడకు మూడు.. సిరాజ్‌, అశోక్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. బట్లర్‌ (25), సుదర్శన్‌ (22) రాణించారు. వరుణ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.

శుభ్‌మన్‌ పోరాటం: ఓ మాదిరి ఛేదనను గుజరాత్‌ ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. అయినా కేకేఆర్‌ బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. మ్యాచ్‌ను కాపాడుకునేందుకు చివరి ఓవర్‌ వరకు పోరాడినా టైటాన్స్‌దే పైచేయి అయ్యింది. ఓపెనర్లు గిల్‌, సుదర్శన్‌ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగడంతో తొలి మూడు ఓవర్లలోనే స్కోరు 40కి చేరింది. ఆరో ఓవర్‌లో సుదర్శన్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్‌లో బట్లర్‌ 4,6,4తో పవర్‌ప్లేలో టైటాన్స్‌ 71/1 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. కానీ మధ్య ఓవర్లలో కేకేఆర్‌ బౌలర్లు గుజరాత్‌ను కట్టుదిట్టం చేశారు. 27 బంతుల్లో గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. అటు బట్లర్‌ను స్పిన్నర్‌ వరుణ్‌ అవుట్‌ చేశాడు. సుందర్‌ (13) కూడా విఫలమయ్యాడు. అయితే 17వ ఓవర్‌లో గ్రీన్‌ డైవింగ్‌ క్యాచ్‌తో గిల్‌ పోరాటం ముగిసింది. అప్పటికి సమీకరణం 18 బంతుల్లో 23 పరుగులకు చేరింది. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. ఫిలిప్స్‌ (19)ను పేసర్‌ రమణ్‌దీప్‌ అవుట్‌ చేసినా మరో 2 బంతులుండగానే టైటాన్స్‌ మ్యాచ్‌ను ముగించింది.


గ్రీన్‌ ఒక్కడే..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఎట్టకేలకు గ్రీన్‌ బ్యాట్‌ ఝుళిపించినా, అతడికి మరో ఎండ్‌లో సహకారం కరువైంది. దీనికి తోడు ఆఖర్లో గుజరాత్‌ బౌలర్లు 33 పరుగులే ఇచ్చి చివరి 6 వికెట్లు పడగొట్టారు. దీంతో కేకేఆర్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌ రహానె తొలి ఓవర్‌లోనే గోల్డెన్‌ డకౌట్‌ కాగా, రెండో ఓవర్‌లోనే రఘువంశీ (8) కూడా వెనుదిరిగాడు. ఇక ఆలెన్‌ స్థానంలో బరిలోకి దిగిన మరో ఓపెనర్‌ సైఫర్ట్‌ (19) నాలుగో ఓవర్‌లో రబాడకు చిక్కాడు. తద్వారా పవర్‌ప్లేను కేకేఆర్‌ 32/3 స్కోరుతో పేలవంగా ముగించింది. ఈ దశలో గ్రీన్‌-పోవెల్‌ అడపాదడపా బౌండరీలతో నాలుగో వికెట్‌కు 55 రన్స్‌ జోడించారు. 11వ ఓవర్‌లో పోవెల్‌ నిష్క్రమించాక గ్రీన్‌ జోరు పెంచాడు. 12వ ఓవర్‌లో స్పిన్నర్‌ రషీద్‌ను లక్ష్యంగా చేసుకుని 4,6,4తో 16 రన్స్‌ సాధించగా.. పేసర్‌ అశోక్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అదే ఊపుతో రషీద్‌ తర్వాతి ఓవర్‌లోనూ 6,4,6తో గ్రీన్‌ దూకుడు సాగించాడు. అయితే ఇదే ఓవర్‌లో అతడు స్టంప్‌, క్యాచ్‌ అవుట్‌ నుంచి తప్పించుకున్నాడు. కానీ 15వ ఓవర్‌ నుంచి టైటాన్స్‌ పేసర్లు పట్టు సాధించడంతో కేకేఆర్‌ ఆట లయ తప్పింది. వరుస ఓవర్లలో అనుకుల్‌ (9), రింకూ (1), రమణ్‌దీప్‌ (17), నరైన్‌ (0), కార్తీక్‌ త్యాగి (6) పెవిలియన్‌కు చేరడంతో గ్రీన్‌ క్రీజులో ఉన్నా లాభం లేకపోయింది. ఇక చివరి ఓవర్‌లో రషీద్‌ ఆరు పరుగులే ఇచ్చి గ్రీన్‌ వికెట్‌ను కూడా తీయడంతో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు

కోల్‌కతా: సైఫర్ట్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రబాడ 19, రహానె (సి) రబాడ (బి) సిరాజ్‌ 0, రఘువంశీ (సి) బట్లర్‌ (బి) రబాడ 8, గ్రీన్‌ (సి) బట్లర్‌ (బి) రషీద్‌ 79, పోవెల్‌ (సి) సిరాజ్‌ (బి) అశోక్‌ 27, అనుకుల్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 9, రింకూ (సి) బట్లర్‌ (బి) రబాడ 1, రమణ్‌దీప్‌ (సి) సిరాజ్‌ (బి) అశోక్‌ 17, నరైన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సిరాజ్‌ 0, త్యాగి (రనౌట్‌) 6, అరోరా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 180 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-5, 2-21, 3-32, 4-87, 5-147, 6-148, 7-165, 8-166, 9-173, 10-180; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-23-2, రబాడ 4-0-29-3, ప్రసిద్ధ్‌ 4-0-32-1, అశోక్‌ 4-0-45-2, రషీద్‌ 4-0-44-1.

గుజరాత్‌: సుదర్శన్‌ (సి) త్యాగి (బి) నరైన్‌ 22, గిల్‌ (సి) గ్రీన్‌ (బి) వైభవ్‌ 86, బట్లర్‌ (సి) గ్రీన్‌ (బి) వరుణ్‌ 25, వాషింగ్టన్‌ (సి) త్యాగి (బి) వరుణ్‌ 13, ఫిలిప్స్‌ (సి) రింకూ (బి) రమణ్‌దీప్‌ 19, తెవాటియా (నాటౌట్‌) 7, షారుక్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.4 ఓవర్లలో 181/5; వికెట్ల పతనం: 1-57, 2-95, 3-141, 4-158, 5-177; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-35-1, కార్తీక్‌ త్యాగి 4-0-40-0, అనుకుల్‌ 3-0-37-0, నరైన్‌ 4-0-28-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-34-2, రమణ్‌దీప్‌ 0.4-0-5-1.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 5 4 0 1 9 1.067

బెంగళూరు 5 4 1 0 8 1.503

రాజస్థాన్‌ 5 4 1 0 8 0.889

గుజరాత్‌ 5 3 2 0 6 0.018

హైదరాబాద్‌ 5 2 3 0 4 0.576

ఢిల్లీ 4 2 2 0 4 0.322

లఖ్‌నవూ 5 2 3 0 4 -0.804

చెన్నై 5 2 3 0 4 -0.846

ముంబై 5 1 4 0 2 -1.076

కోల్‌కతా 6 0 5 1 1 -1.149

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 18 , 2026 | 02:47 AM