‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ గిల్
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:14 AM
భారత క్రికెట్ జట్టు వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది అతను టెస్టుల్లో 983, వన్డేల్లో 490 పరుగులతో...
ద్రవిడ్, మిథాలీలకు జీవిత సాఫల్య పురస్కారం
15న బీసీసీఐ అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది అతను టెస్టుల్లో 983, వన్డేల్లో 490 పరుగులతో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో ఏడు శతకాలతో 1764 రన్స్ సాధించాడు. అలాగే క్రికెట్‌కు అందించిన సేవలకు గాను మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, మాజీ బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లకు కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం దక్కనుంది. ద్రవిడ్ శిక్షణలోనే 2024 టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇక దేశవాళీల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించినందుకు ముంబై యువ ప్లేయర్ ఆయుష్ మాత్రే.. లాలా అమర్‌నాథ్ అవార్డు అందుకోనున్నాడు. ఈనెల 15న న్యూఢిల్లీలో జరిగే బీసీసీఐ వార్షిక నమన్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే
'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు