Share News

శ్రేయాస్‌కే టీ20 సారథ్యం?

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:46 AM

భారత టీ20 జట్టు నూతన సారథిగా శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంపిక లాంఛనమే. ఈనెల 26 నుంచి జూలై 11 వరకు భారత జట్టు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో 7 టీ20లు ఆడనుంది...

శ్రేయాస్‌కే టీ20 సారథ్యం?

సూర్యకు జట్టులో చోటూ కష్టమే

  • యూకే టూర్‌కు జట్టు ఎంపిక నేడు

ముంబై: భారత టీ20 జట్టు నూతన సారథిగా శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంపిక లాంఛనమే. ఈనెల 26 నుంచి జూలై 11 వరకు భారత జట్టు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో 7 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో 3 వన్డేల సిరీస్‌ ఉంటుంది. అయితే ముందుగా టీ20 జట్టును శనివారం సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. 31ఏళ్ల శ్రేయాస్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో పంజాబ్‌, కోల్‌కతా, ఢిల్లీ జట్లను ఫైనల్‌ చేర్చిన అనుభవముంది. 2024లో కోల్‌కతాను విజేతగా నిలిపాడు. ఏడాదిన్నరగా పేలవఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్‌ కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు జట్టులో చోటు కూడా కష్టమే. తిలక్‌ వర్మను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేయొచ్చు. ఐపీఎల్‌లో 28 వికెట్లతో అదరగొట్టిన భువనేశ్వర్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో జపాన్‌లో జరిగే ఆసియాగేమ్స్‌లో తలపడే భారత టీ20 జట్టును కూడా ప్రకటించనున్నారు. దీనికి తిలక్‌ వర్మ కెప్టెన్‌గా ఉండే చాన్సుంది. అలాగే టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు దక్కొచ్చు.

ఈ వార్తలనూ చదవండి:

కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ

వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..

Updated Date - Jun 06 , 2026 | 03:46 AM