Share News

శ్రేయాస్‌కు రూ. 24 లక్షలు జరిమానా

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:21 AM

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు రెండోసారి జరిమానా పడింది. తమ తొలి మ్యాచ్‌లో జట్టు స్లో ఓవర్‌ రేట్‌కు...

 శ్రేయాస్‌కు రూ. 24 లక్షలు జరిమానా

చెన్నై: ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు రెండోసారి జరిమానా పడింది. తమ తొలి మ్యాచ్‌లో జట్టు స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడినందుకు ఇప్పటికే రూ. 12 లక్షల జరిమానా ఎదుర్కొన్న శ్రేయా్‌సకు.. తాజాగా శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్‌ బౌలర్లు నిర్ణీత సమయానికి పూర్తి ఓవర్ల కోటా ముగించలేకపోయారు. దీంతో రెండోసారి నిబంధనల ఉల్లంఘన కింద ఈసారి సారథి శ్రేయాస్‌కు రూ. 24 లక్షలు జరిమానా విధించారు. అంతేగాకుండా.. జట్టు సభ్యులకు వాళ్ల మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత పడింది.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 02:21 AM