Share News

శ్రీచరణికి ఉత్తమ రేటింగ్‌

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:18 AM

భారత మహిళల జట్టు స్పిన్నర్‌ శ్రీచరణి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ బౌలర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ క్రమంలో కెరీర్‌లోనే...

శ్రీచరణికి ఉత్తమ రేటింగ్‌

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: భారత మహిళల జట్టు స్పిన్నర్‌ శ్రీచరణి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ బౌలర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ క్రమంలో కెరీర్‌లోనే తొలిసారిగా 800 రేటింగ్‌ పాయింట్లను సాధించగలిగింది. ప్రస్తుతం 804 పాయింట్లతో చరణి.. ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 2011లో మిథాలీ రాజ్‌ (708) అత్యధిక పాయింట్లతో నెలకొల్పిన ఘనతను అధిగమించింది. దీనికితోడు బౌలింగ్‌ విభాగంలో ఆల్‌టైమ్‌ అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లను సాధించిన రెండో బౌలర్‌గానూ నిలిచింది. మేగన్‌ షట్‌ (806) పేరిట ఉన్న రికార్డును దాటేందుకు శ్రీచరణి మరో మూడు పాయింట్ల దూరంలోనే ఉంది. ఇక ఆసియాక్‌పలో 14 వికెట్లు తీసిన దీప్తి శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్‌లో మంధాన 5, షఫాలీ 6, హర్మన్‌ 10 స్థానాల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్

వెస్టిండీస్‌తో సిరీస్.. వన్డే జట్టులో పంత్, హార్దిక్ పాండ్యలకు చోటు?

Updated Date - Sep 16 , 2026 | 05:18 AM