జై షాకు సంబంధం లేదు
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:49 AM
చాన్నాళ్లుగా బీసీసీఐ తనపై వివక్ష చూపుతూనే ఉందనీ, అందుకే కామెంటేటర్ బాధ్యతల నుంచి వైదొలిగానని టీమిండియా మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ శుక్రవారం...
తన రాజీనామాపై శివరామకృష్ణన్
న్యూఢిల్లీ: చాన్నాళ్లుగా బీసీసీఐ తనపై వివక్ష చూపుతూనే ఉందనీ, అందుకే కామెంటేటర్ బాధ్యతల నుంచి వైదొలిగానని టీమిండియా మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అతడిని పక్కనబెట్టడం వెనక గతంలో బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన జై షా హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపైౖ శివరామకృష్ణన్ స్పందిస్తూ.. ఈ అంశంలో జై షాకు ఎలాంటి సంబంధం లేదని శనివారం పోస్ట్ చేశాడు. ‘ఈ వ్యవహారంలోకి బీసీసీఐ పరిపాలనను లాగవద్దు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న జై షాతో ఇతర పెద్దలకు నా రాజీనామాతో సంబంధం లేదు. ఇది బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే’ అని ఆ పోస్ట్‌లో తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..