రైలెక్కి..ఇంటికి!
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:35 AM
టీమిండియా ఆటగాడు శివం దూబే రొటీన్‌కు భిన్నంగా రైల్లో ప్రయాణించాడు. భారత క్రికెటర్లంటే చార్టెడ్ ఫ్లయిట్‌లు లేదా లగ్జరీ విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కానీ, ఆ టిక్కెట్లు అందుబాటులో...
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శివం దూబే రొటీన్‌కు భిన్నంగా రైల్లో ప్రయాణించాడు. భారత క్రికెటర్లంటే చార్టెడ్ ఫ్లయిట్‌లు లేదా లగ్జరీ విమానాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. కానీ, ఆ టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో రైల్లో థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకొన్నాడు. టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు సభ్యుడైన దూబే అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైల్లో చేరుకొన్నాడు. కారు కంటే త్వరగా వెళ్లవచ్చన్న ఉద్దేశంతోనే రైల్లో వెళ్లాడట. అప్పటిదాకా స్టేషన్ బయట కార్లో కూర్చున్న దూబే...రైలు మరో ఐదు నిమిషాల్లో బయల్దేరుతుందనగా వచ్చి రైలెక్కేశాడు. తెల్లవారుజామున 5.10కు బయల్దేరిన ఈ రైలు ప్రయాణంలో దూబేతోపాటు అతని భార్య అంజుమ్ కూడా ఉంది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్, టోపీ ధరించినట్టు దూబే చెప్పాడు. ట్రైన్‌లో అప్పర్ బెర్త్‌లోనే పడుకొన్నానని, టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు కిందకు దిగినా.. అదృష్టవశాత్తూ తనను ఎవరూ గుర్తు పట్టలేదన్నాడు. టీసీ వచ్చి ‘శివం దూబే? ఎవరతను.. క్రికెటరా?’ అని అడిగితే.. తన భార్య అంజుమ్ ‘లేదు.. లేదు. అతనెందుకొస్తాడు’ అని టీసీ దృష్టిని మరల్చినట్టు దూబే చెప్పాడు. ప్రయాణం సాఫీగా సాగినా.. బోరివలిలో దిగినప్పుడు ఫ్యాన్స్ కళ్లనుంచి తప్పించుకోవడం కష్టమేనని అనిపించిందన్నాడు. అయితే, తాను రైల్లో వస్తున్న విషయాన్ని ముందుగానే పోలీసులకు చెప్పానని, ముంబైలో దిగే సమయానికి..తనకు భద్రతను ఏర్పాటు చేయడంతో స్టేషన్ నుంచి ఇంటికి ఇబ్బందిపడకుండా చేరుకొన్నానని దూబే పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్