ఐసీయూలో అఫ్ఘాన్ మాజీ పేసర్
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:41 AM
అఫ్ఘానిస్థాన్ మాజీ పేసర్ షాపుర్ జద్రాన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తీవ్ర అనారోగ్యంతో...
షాపుర్ జద్రాన్ పరిస్థితి విషమం
ముంబై: అఫ్ఘానిస్థాన్ మాజీ పేసర్ షాపుర్ జద్రాన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తీవ్ర అనారోగ్యంతో అతను ఇక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదే విషయాన్ని అఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఎడమచేతి వాటం పేసరైన 38 ఏళ్ల జద్రాన్.. 43 వన్డేలు, 32 టీ20 మ్యాచ్‌లాడాడు. ఓవరాల్‌గా 71 వికెట్లు పడగొట్టాడు. 2020లో చివరి మ్యాచ్ ఆడిన జద్రాన్.. అఫ్ఘాన్ క్రికెట్ జట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషించాడు. అతను 3 టీ20 ప్రపంచక్‌పలలో పాల్గొన్న అఫ్ఘాన్ జట్టులో సభ్యుడు.
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!