Share News

ధోనీ సలహాతోనే.. ముల్లన్‌పూర్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:55 AM

భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ ఇచ్చిన సలహా అమూల్యమని వెస్టిండీస్‌ బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ వెల్లడించాడు...

ధోనీ సలహాతోనే.. ముల్లన్‌పూర్‌

భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ ఇచ్చిన సలహా అమూల్యమని వెస్టిండీస్‌ బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ వెల్లడించాడు. టీమిండియాతో శనివారం జరిగిన మూడో, ఆఖరి వన్డేలో 352 పరుగుల రికార్డు ఛేదనలో కెప్టెన్‌ హోప్‌ (162 నాటౌట్‌) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గతంలో ధోనీ ఇచ్చిన సలహాతోనే ఇన్నింగ్స్‌ ఆసాంతం తాను క్రీజులో నిలిచానని హోప్‌ చెప్పాడు. ‘గొప్ప ఆటగాడు ధోనీతో గతంలో మాట్లాడా. బ్యాటింగ్‌ చేసే సమయంలో మనం ఆలోచించిన దానికంటే ఎక్కువ సమయం ఉంటుందని అతడు చెప్పాడు. ఆ సలహాతో ఓపికగా క్రీజులో నిలిచి లక్ష్య ఛేదనను పూర్తి చేశాం’ అని హోప్‌ వివరించాడు.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 05:55 AM