షఫాలీ సెంచరీ
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:38 AM
ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) జోరు కొనసాగిస్తూ టీ20లలో తొలి సెంచరీతో కదం తొక్కగా.. ఆపై బౌలర్లు తమ పాత్రను సమర్థంగా...
స్వర్ణ పోరుకు భారత్
114 పరుగులతో బంగ్లా చిత్తు
ఫైనల్లో శ్రీలంకతో అమీతుమీ
నిషిన్ (జపాన్): ఓపెనర్ షఫాలీ వర్మ (49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 నాటౌట్) జోరు కొనసాగిస్తూ టీ20లలో తొలి సెంచరీతో కదం తొక్కగా.. ఆపై బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించడంతో ఆసియా క్రీడల క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో 114 పరుగులతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట భారత్ 20 ఓవర్లలో 195/4 స్కోరు చేసింది. హర్మన్ (40), మంధాన (37) సత్తా చాటారు. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి బంగ్లా 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిలార అక్తర్ (27) టాప్ స్కోరర్. దీప్తీశర్మ (3/7), నందనీ శర్మ (3/25), శ్రీచరణి (2/7) ప్రత్యర్థిని వణికించారు. మంగళవారం జరిగే స్వర్ణ పతక పోరులో..గత ఆసియాడ్ మాదిరే శ్రీలంకతో మనోళ్లు అమీతుమీ తేల్చుకుంటారు. ఫైనల్‌కు చేరిన దరిమిలా హర్మన్ సేన కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. ఆదివారమే జరిగిన తొలి సెమీ్‌సలో శ్రీలంక 8 వికెట్లతో పాకిస్థాన్‌ను ఓడించింది.
సంక్షిప్తస్కోర్లు
భారత్ 20: ఓవర్లలో 195/4 (షఫాలీ 100 నాటౌట్, హర్మన్ 40, మంధాన 37, సంజిదా అక్తర్ 1/25, రబేయ ఖాన్ 1/35).
బంగ్లాదేశ్: 15.4 ఓవర్లలో 81 ఆలౌట్ (దిలార అక్తర్ 27, సుల్తానా ఖాటూన్ 12 నాటౌట్, షర్మిన్ అక్తర్ 10, దీప్తీశర్మ 3/7, నందనీ శర్మ 3/25, శ్రీచరణి 2/7).
1
మహిళల టీ20ల ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (9) కొట్టిన వెస్టిండీస్ స్టార్లు డాటిన్, హేలీ మాథ్యూస్ రికార్డులను సమం చేసిన షషాలీ.
1
ఆసియా క్రీడల్లో సెంచరీ చేసిన తొలి మహిళా బ్యాటర్ షఫాలీ.
1
పొట్టి ఫార్మాట్‌లో వేగవంతమైన శతకం (49 బంతులు) చేసిన భారత మహిళా బ్యాటర్‌గా హర్మన్ రికార్డును సమం చేసిన షఫాలీ.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: డబుల్ సిల్వర్.. భారత షూటర్లను అభినందించిన ప్రధాని మోదీ
న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?