Share News

పాక్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:27 AM

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు ఆదివారం వీడ్కోలు పలికాడు. మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న 38 ఏళ్ల సర్ఫరాజ్‌ చివరిసారిగా...

పాక్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌

క్రికెట్‌కు గుడ్‌బై

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు ఆదివారం వీడ్కోలు పలికాడు. మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న 38 ఏళ్ల సర్ఫరాజ్‌ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాపై పెర్త్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. వికెట్‌ కీపర్‌, బ్యాటరైన సర్ఫరాజ్‌ 2007లో భారత్‌తో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేం చేశాడు. 54 టెస్ట్‌లు, 117 వన్డేలు, 61 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా 6,614 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ కెరీర్‌లో 6 శతకాలున్నాయి. 315 క్యాచ్‌లు, 56 స్టంపింగ్‌లు చేసి పాక్‌ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. వంద మ్యాచుల్లో సారథిగా వ్యవహరించిన సర్ఫరాజ్‌.. 2006లో అండర్‌-19 జట్టును చాంపియన్‌గా నిలపడంతో పాటు సీనియర్‌ స్థాయిలో 2017లో చాంపియన్స్‌ ట్రోఫీని పాక్‌కు అందించాడు. కాగా..సర్ఫరాజ్‌ను టెస్ట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నియమించనున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:27 AM